Wednesday 31 July 2013

తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది..!

చిత్రం         : తల్లా! పెళ్లామా! (1970)
సంగీతం     : టీ.వీ. రాజు
రచన         : డా. సి. నారాయణ రెడ్డి
గానం         : ఘంటశాల, ఎన్టీఆర్
నటీనటులు : ఎన్టీఆర్, చంద్రకళ
దర్శకుడు    : నందమూరి తారక రామారావు

Englishlo Ikkada Choodandi :)

తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది..!

తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది… రాయలసీమ నాది… సర్కారు నాది… నెల్లూరు నాది...
అన్నీ కలిసిన తెలుగునాడు… మనదే… మనదే… మనదేరా...
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా... మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా... వచ్చాడన్నా... ఆ...
వచ్చిండన్నా... వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా...
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది... నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది... నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం... ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం... వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి ధీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది… రాయలసీమ నాది… సర్కారు నాది… నెల్లూరు నాది...
అన్నీ కలిసిన తెలుగునాడు… మనదే… మనదే… మనదేరా...
తెలుగు జాతి మనది…. నిండుగ వెలుగు జాతి మనది

1 comments:

Anonymous said...

రెండో చరణం లో 'భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో' కాదు 'భాగవతం వెలసింది ఏకశిలానగరంలో'

Post a Comment